
జనరల్

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ వచ్చిన వదంతులు ఆ దేశంలో తీవ్ర కలకలం రేపాయి. ఈ ప్రచారాన్ని పాకిస్థాన్ ఆర్మీ తీవ్రంగా ఖండించినట్లు సమాచారం. మరోవైపు రావల్పిండిలోని అదియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని పార్టీ డిమాండ్ చేస్తోంది.
ఇమ్రాన్ ఖాన్‌ను కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు కలిసేందుకు అనుమతించాలని పీటీఐ కోరింది. ఆయన పరిస్థితిపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతి నిరాకరిస్తే అదియాలా జైలును ముట్టడించే అవకాశం ఉందని పార్టీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో పాకిస్థాన్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!