

జెన్ జీపై ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా తన వ్యాఖ్యలపై ఆమె వివరణ ఇచ్చారు. దేశంలోని యువత మొత్తాన్ని ఉద్దేశించి తాను మాట్లాడలేదని, తమను తాము ‘బొద్దింకలు’గా అభివర్ణించుకున్న కొందరిని మాత్రమే ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల ఉద్దేశం స్పష్టంగానే ఉందని, వాటిని మొత్తం జెన్ జీకి ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జెన్ జీ నిరసనకారులకు సంబంధించిన వీడియోలను ఉద్దేశించి కంగనా గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జెన్ జీని ‘గట్టర్ జనరేషన్’గా అభివర్ణిస్తూ.. నిరసనకారుల రీల్స్, వారు మాట్లాడే తీరు, ఉపయోగించే భాషపై తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో తాజాగా కంగనా తన ఉద్దేశాన్ని వివరిస్తూ, తన వ్యాఖ్యలు కొందరికి మాత్రమే పరిమితమని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!