
జనరల్

అమెరికాలోని నాలుగు రాష్ట్రాలు ఆగస్టు 15ను ‘ఇండియా డే’గా ప్రకటించాయి. న్యూయార్క్, న్యూజెర్సీ గవర్నర్లు ఈ మేరకు ప్రకటనలు చేయగా, మసాచుసెట్స్, డెలావేర్ రాష్ట్రాలు కూడా భారత్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రకటనలు చేశాయి. దీంతో అమెరికాలోని భారతీయ సమాజంలో వేడుకల సందడి నెలకొంది.
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో భారత జాతీయ పతాకాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. న్యూయార్క్‌లోని ప్రతిష్ఠాత్మక ఎంపైర్ స్టేట్ భవనాన్ని త్రివర్ణ రంగులతో వెలిగించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అమెరికాలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు లభిస్తున్న గుర్తింపుగా ఈ పరిణామాన్ని పేర్కొంటున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!