

జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మల్లారెడ్డి కార్యాలయం, నివాసాలపై ఏసీబీ దాడులు నిర్వహించిన తర్వాత శాఖలో అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బందిలో తీవ్ర ఆందోళన నెలకొంది.
కల్లు వ్యాపారులు, మద్యం షాపులు, బెల్ట్ షాపులు, కల్లు డిపోల నిర్వాహకుల నుంచి నెలవారీ అక్రమ వసూళ్లను నమోదు చేసిన డైరీ బయటపడినట్లు సమాచారం. దీంతో మరిన్ని ఏసీబీ చర్యలు ఎవరిపై ఉంటాయోననే భయం శాఖలో కనిపిస్తోంది. కొందరు ఎస్‌ఐ, సీఐలపై ఫిర్యాదులు ఉన్నతాధికారులకు, ఏసీబీకి చేరినట్లు తెలుస్తోంది.
జిల్లాలో కల్తీ కల్లు, అనధికార బెల్ట్ షాపులు, అక్రమ మద్యం విక్రయాలు విస్తృతంగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మధ్యవర్తుల ద్వారా ముడుపులు వసూలు చేస్తున్న వ్యవస్థ ఉందని సమాచారం. ఏసీబీ మరికొందరు అధికారులపై కూడా దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతుండటంతో శాఖలో టెన్షన్ పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!