
జనరల్

దేశీయ వాహన పరిశ్రమ జూలైలో ఇప్పటివరకు అత్యుత్తమ అమ్మకాలను నమోదు చేసింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) వెల్లడించిన వివరాల ప్రకారం. ప్రయాణికుల వాహనాల (PV) అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 34.3% పెరిగి 4,57,810 యూనిట్లకు చేరాయి. గతేడాది జూలైలో ఇవి 3,40,772 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇక ద్విచక్ర వాహనాల విక్రయాలు 22.6% వృద్ధితో 19,23,483 యూనిట్లకు, త్రిచక్ర వాహనాల అమ్మకాలు 33.4% పెరిగి 92,560 యూనిట్లకు చేరాయి. అన్ని ప్రధాన విభాగాల్లో రెండంకెల వృద్ధి నమోదవుతున్న నేపథ్యంలో పండుగల సీజన్‌లోనూ ఈ సానుకూల ధోరణి కొనసాగుతుందని SIAM డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వినియోగదారుల సెంటిమెంట్ బలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!