
షోస్

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, మక్తల్‌లోని వెంకటరమణ థియేటర్ నుంచి బుధవారం ‘ఇరుముడి’ సినిమాను తొలగించడంతో ప్రేక్షకులు నిరసనకు దిగారు. పలు గ్రామాల నుంచి సినిమా చూసేందుకు వచ్చిన ప్రజలకు థియేటర్లో సినిమా ప్రదర్శన లేకపోవడంతో నిరాశ చెందారు. దీంతో థియేటర్ ఎదుట కూర్చొని ‘ఇరుముడి’ సినిమాను మళ్లీ ప్రదర్శించాలని భక్తులు, ప్రేక్షకులు డిమాండ్ చేశారు.
మంగళవారం కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సొంత పనులను పక్కన పెట్టి థియేటర్‌కు వచ్చినప్పటికీ టికెట్లు దొరకలేదని తెలిపారు. సినిమా చూసేందుకు ఎంతసేపైనా వేచి ఉండటంతో పాటు, అవసరమైతే కింద కూర్చొని అయినా సినిమా చూసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రేక్షకులు పేర్కొన్నారు. ‘ఇరుముడి’ చిత్రాన్ని మళ్లీ ప్రదర్శించి తమకు సినిమా చూసే అవకాశం కల్పించాలని థియేటర్ యాజమాన్యాన్ని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!