

సిలికాన్ వ్యాలీ నుంచి వాల్ స్ట్రీట్ వరకు ప్రపంచ వ్యాపార రంగంలో భారతీయులు, భారత సంతతికి చెందిన నాయకులు తమ సత్తా చాటుతున్నారు. బిలియన్ డాలర్ల విలువైన బహుళజాతి సంస్థలకు సారథ్యం వహిస్తూ, సాంకేతికత, ఆర్థిక సేవలు, వినియోగ వస్తువులు, ఔషధాలు వంటి కీలక రంగాల్లో అంతర్జాతీయ వ్యాపార వ్యూహాలను రూపొందిస్తున్నారు.
సాంకేతిక రంగంలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల, ఐబీఎంకు అరవింద్ కృష్ణ, యూట్యూబ్‌కు నీల్ మోహన్, అడోబ్‌కు శంతను నారాయణ్ నాయకత్వం వహిస్తున్నారు. సైబర్ భద్రత, నెట్‌వర్కింగ్, క్లౌడ్ రంగాల్లో పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌కు నికేష్ అరోరా, అరిస్టా నెట్‌వర్క్స్‌కు జయశ్రీ ఉల్లాల్, నెట్‌యాప్‌కు జార్జ్ కురియన్ ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఇక భారతీయ ఐటీ రంగంలో ఇన్ఫోసిస్‌కు సలీల్ పరేఖ్, కాగ్నిజెంట్‌కు రవికుమార్ ఎస్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ గ్రూప్‌కు అజయ్ బంగా, పీ అండ్ జీకి శైలేష్ జెజూరీకర్, టి-మొబైల్ యూఎస్‌కు శ్రీని గోపాలన్, నొవార్టిస్‌కు వసంత్ నరసింహన్, మైక్రాన్ టెక్నాలజీకి సంజయ్ మెహ్రోత్రా, హనీవెల్‌కు విమల్ కపూర్, ఫ్లెక్స్‌కు రేవతి అద్వైతి, చానెల్‌కు లీనా నాయర్ వంటి వారు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రపంచస్థాయి సంస్థల నిర్ణయాత్మక స్థానాల్లో భారతీయుల ప్రాతినిధ్యం పెరుగుతుండటం దేశానికి గర్వకారణంగా నిలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!