
సినిమాలు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఓ ఆటోను ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతులను చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద ధాటికి ఆటో పూర్తిగా ధ్వంసమైంది.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం బస్సు అధిక వేగమా, డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా ఇతర కారణాలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!