
గాసిప్స్

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో త్వరలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశమున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈసారి నలుగురు ముఖ్యమంత్రులకు బోర్డులో స్థానం కల్పించే అవకాశం ఉందని సమాచారం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
దక్షిణాది నుంచి ప్రస్తుత పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె. లక్ష్మణ్‌ను కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే బోర్డు పునర్వ్యవస్థీకరణపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం తీసుకోవాల్సి ఉంది. తాజా మార్పులు అమల్లోకి వస్తే కీలక నేతలకు జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!