

డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుతో నిర్వహిస్తున్న ఫెలోస్ కార్యక్రమం తొలి బ్యాచ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ మధు యాష్కీ గౌడ్, మాజీ చైర్‌పర్సన్ ప్రవీణ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఫెలోస్‌తో రాహుల్ గాంధీ మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
సమావేశంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆలోచనలు, విధానాలు, దేశాభివృద్ధిలో వృత్తి నిపుణుల పాత్ర తదితర అంశాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా వృత్తి నిపుణులను ఏఐపీసీతో అనుసంధానం చేయడం, సంస్థను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపైనా చర్చ జరిగింది. తదుపరి బ్యాచ్‌కు దరఖాస్తుల ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రజాసేవ, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, అభివృద్ధిపై ఆసక్తి ఉన్న వృత్తి నిపుణులు, మేధావులు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!