
జనరల్

టీమిండియా క్రికెటర్ రింకు సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ వివాహం డిసెంబర్ 4, 2026న జరగనుంది. లక్నోలోని రమాడా హోటల్‌లో వివాహ వేడుక నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. పెళ్లి తేదీ, వేదిక ఖరారు కావడంతో కుటుంబ సభ్యులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బంధువులు, సన్నిహితులు, కుటుంబ మిత్రులతో పాటు క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు కూడా వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.
రింకు సింగ్, ప్రియా సరోజ్‌ల నిశ్చితార్థం 2025 జూన్ 8న లక్నోలోని ది సెంట్రమ్ హోటల్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ ప్రైవేట్ వేడుక నిర్వహించారు. అప్పటి నుంచి వీరి వివాహ తేదీపై ఆసక్తి కొనసాగుతోంది. తాజాగా డిసెంబర్ 4న వివాహం జరగనున్నట్లు తేదీ, వేదిక ఖరారు కావడంతో పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!