

రాజస్థాన్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కైలాష్ చంద్‌కు కేవలం ఒక్క ఓటు మాత్రమే రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక వార్డు నుంచి పోటీ చేసిన ఆయనకు కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు సైతం ఓటు వేయలేదనే విషయం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా అభ్యర్థికి కుటుంబం, సన్నిహితులు, పార్టీ శ్రేణుల మద్దతు ఉంటుందని భావిస్తారు. కానీ కైలాష్ చంద్ విషయంలో అందుకు పూర్తి భిన్నమైన ఫలితం రావడంతో ఈ అంశం సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.
ఈ అనూహ్య ఫలితంపై కైలాష్ చంద్ స్పందిస్తూ.. “ఏది ఏమైనా ఆ వార్డులో ఎవరో ఒకరు నాకు ఓటు వేశారు” అంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇంతటి ఘోర పరాజయానికి అసలు కారణాలేమిటనే దానిపై స్థానికంగా చర్చ సాగుతోంది. ఒక్క ఓటుతో ముగిసిన ఈ ఎన్నికల ఫలితం స్థానిక బీజేపీ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!