
సినిమాలు

భారతదేశంలో ప్రముఖ విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో ‘గ్రేట్ కనెక్షన్స్ సేల్’ను ప్రకటించింది. కనెక్టింగ్ విమానాలపై ప్రత్యేక ఛార్జీలతో పాటు అదనపు సేవలపై రాయితీలను అందిస్తోంది. అన్ని బుకింగ్ మార్గాల్లో ఈ ఆఫర్ సెప్టెంబర్ 17, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 18, 2026 నుంచి మార్చి 31, 2027 మధ్య ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే బయలుదేరే తేదీకి కనీసం మూడు రోజుల ముందే కనెక్టింగ్ విమానాలను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ సేల్‌లో భాగంగా దేశీయ కనెక్టింగ్ విమానాలకు వన్‌వే, అన్ని ఛార్జీలు కలిపిన టికెట్ ధరలు ₹3,999 నుంచి ప్రారంభమవుతాయి. అంతర్జాతీయ కనెక్టింగ్ విమానాల టికెట్ ధరలు ₹8,999 నుంచి అందుబాటులో ఉంటాయి. నిర్ణీత ప్రయాణ కాలంలో కనెక్టింగ్ విమానాల్లో ప్రయాణించాలనుకునే వారికి ఈ ఆఫర్ ద్వారా తక్కువ ధరల్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!