
క్రీడలు

ఏలూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాకు నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న ముస్తఫాను పోలీసులు గుజరాత్‌లో అరెస్ట్ చేసి అర్థరాత్రి నూజివీడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు.
వైద్య పరీక్షల అనంతరం ముస్తఫాను కోర్టులో హాజరుపరచగా, నూజివీడు కోర్టు ఈ నెల 19వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కిడ్నాప్ కేసులో ముస్తఫా పాత్రపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!