

తప్పుడు ప్రకటనలు, లేబులింగ్ నిబంధనల ఉల్లంఘనలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) చర్యలను ముమ్మరం చేసింది. పలు ఆహార ఉత్పత్తుల సంస్థలకు నోటీసులు జారీ చేసి, వినియోగదారులను తప్పుదోవ పట్టించే క్లెయిమ్‌లపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రకటనలపై 7 రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.
హెరిటేజ్ ఫుడ్స్‌కు ‘ఫ్రెష్ పనీర్’, ‘హెల్తీ’ వంటి క్లెయిమ్‌లపై నోటీసు జారీ చేసింది. డీఐఏ ఫుడ్స్ ‘ఆల్ నేచురల్’, ‘100% ఆర్గానిక్’, ‘వీగన్’ వంటి అనుమతులు లేని క్లెయిమ్‌లపై వివరణ కోరింది. అలాగే సిప్జర్ సంస్థ ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అప్రూవ్డ్’, ‘రోగ నిరోధక శక్తిని పెంచుతుంది’, ‘టాక్సిన్లు తొలగిస్తుంది’, ‘ఆర్గానిక్ కూరగాయలతో తయారు చేశాం’ వంటి ప్రకటనలపై నోటీసులు అందుకుంది. వివరణ ఇవ్వకపోతే ఆహార భద్రత చట్టం, 2006 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హెచ్చరించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!