
జనరల్

వర్షం కారణంగా గత నెల 30న ఖమ్మంలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ వాయిదా పడింది. దీంతో ఈ నెల 9వ తేదీన సభ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సభ నిర్వహణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించిన అనంతరం అధికారిక ప్రకటన చేస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులకు సంబంధించిన అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్న ఈ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!