
జనరల్

తెలంగాణలో 37 రాష్ట్ర స్థాయి కార్పొరేషన్, ఫెడరేషన్ చైర్మన్ల పదవీకాలం జులై 8తో ముగియనుంది. 2024 జులై 7న రెండేళ్ల కాలపరిమితితో ప్రభుత్వం వీరిని నియమించింది. ప్రస్తుతం పలువురు చైర్మన్లు తమ పదవుల కొనసాగింపునకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మెజారిటీ చైర్మన్లను పునర్నియమించే ఆలోచనలో ప్రభుత్వం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
మాజీ చైర్మన్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. రెన్యువల్‌కు అర్హులైన వారి సంఖ్య పరిమితంగానే ఉందని తెలుస్తోంది. కొందరికి ప్రస్తుత పదవుల కొనసాగింపుకు బదులుగా ఇతర బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!