

ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తున్న ట్యాలెంటెక్స్-2027ను క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్. ధోనీ ముంబయిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అలెన్ సీఈవో నితిన్ కుక్రేజా, చీఫ్ అకడమిక్ ఆఫీసర్ సి.ఆర్. చౌదరీతో పాటు గత ఐదేళ్లలో ట్యాలెంటెక్స్‌లో అగ్రస్థానాలు సాధించిన విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులతో ధోనీ ముచ్చటించి, వారి ప్రశ్నలకు స్ఫూర్తిదాయకమైన సమాధానాలు ఇచ్చారు.
అలెన్ ట్యాలెంటెక్స్-2027 కోసం సంస్థ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ప్రారంభించింది. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ ప్రతిభా పరీక్షకు అర్హులు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు అభ్యాస ప్రశ్నపత్రాలను పొందవచ్చు. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఈ నెల 15 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!