
జనరల్

యూజర్‌నేమ్ ఫీచర్ వివాదంపై సమాధానం ఇవ్వడానికి ప్రముఖ మెసేజింగ్ వేదిక వాట్సప్‌కు కేంద్ర ప్రభుత్వం మరికొంత గడువు ఇచ్చింది. వాట్సప్ అభ్యర్థన మేరకు మరో మూడు రోజుల సమయం ఇచ్చినట్లు సమాచారం. చర్చలు పూర్తయ్యే వరకు ఈ ఫీచర్‌ను భారత్‌లో అందుబాటులోకి తీసుకురాబోమని వాట్సప్ ప్రతినిధులు కేంద్ర సమాచార, సాంకేతిక శాఖకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఫోన్ నంబర్‌ను బహిర్గతం చేయాల్సిన అవసరం లేకుండా యూజర్‌నేమ్ విధానం అమలు చేస్తే ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టు వేధింపులు, మారుపేర్లతో దాడులు పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై వాట్సప్ నుంచి వివరణ కోరగా, తొలుత ఇచ్చిన గడువు గత శుక్రవారంతో ముగిసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!