

హైదరాబాద్‌లోని డాక్టర్ ఎంసీఆర్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు ప్రారంభం కానున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రోజుకు సుమారు 600 మంది ఓపీ సేవలు పొందుతున్నారు. ఐసీయూ సౌకర్యాలు, ఆపరేషన్ థియేటర్లు సిద్ధం కావడంతో పాటు వైద్య పరికరాల స్టెరిలైజేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత శస్త్రచికిత్సలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు NIMS తరహాలోనే అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందించేలా చవకైన టారిఫ్‌లు, సర్వీస్ రూల్స్ అమలు చేయాలని నిర్ణయించారు. ఆస్పత్రి మౌలిక వసతులను మరింత బలోపేతం చేసేందుకు మల్టీ లెవల్ పార్కింగ్, పీజీ విద్యార్థుల హాస్టళ్ల నిర్మాణానికి కూడా ఆమోదం లభించింది. ఈ చర్యలతో ఆధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యం సామాన్య ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!