26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..

Writer: Chandrika 07:14 AM, 26 ఆగస్టు, 2026
శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు (యూడీఎఫ్‌) సెప్టెంబరు 1, 2026 నుంచి మారనుంది. విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ సంస్థ (ఏఈఆర్‌ఏ) ఆమోదించిన కొత్త టారిఫ్‌ ప్రకారం 2031 మార్చి 31 వరకు ఈ ఛార్జీలు అమల్లో ఉంటాయి. కొత్త విధానంలో విమానాశ్రయం నుంచి బయలుదేరే దేశీయ ప్రయాణికుల యూడీఎఫ్‌ రూ.750 నుంచి రూ.515కు, అంతర్జాతీయ ప్రయాణికుల రుసుము రూ.1,500 నుంచి రూ.1,030కి తగ్గుతుంది. అదే సమయంలో విమానాశ్రయంలో దిగే ప్రయాణికులపై తొలిసారిగా యూడీఎఫ్‌ విధించనున్నారు. దేశీయ ప్రయాణికులకు రూ.220, అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.440గా రుసుము నిర్ణయించారు. ఈ ఫీజు విమాన టికెట్‌లోనే కలిపి వసూలు చేస్తారు.

ఐదేళ్ల కాలంలో యూడీఎఫ్‌ను ఏటా సవరించనున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నార్తర్న్‌ రన్‌వే, నార్తర్న్‌ ప్రిసింక్ట్‌ అభివృద్ధి పూర్తయిన తర్వాత అదనపు ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కొత్త టెర్మినల్‌ ద్వారా ఏటా మరో రెండు కోట్ల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉండగా, దిల్లీ విమానాశ్రయంలో ఫెడెక్స్‌ సుమారు రూ.1,430 కోట్ల పెట్టుబడితో ఎయిర్‌ కార్గో హబ్‌ను ఏర్పాటు చేయనుంది. 2.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 12-18 నెలల్లో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడు సమక్షంలో దీనికి శంకుస్థాపన జరిగింది. ఈ కేంద్రం ద్వారా ప్యాకేజీల ప్రాసెసింగ్‌ సామర్థ్యం గంటకు 600 నుంచి 5,000కు పెరగనుంది. దేశంలో ఎయిర్‌ ఫ్రైట్‌ స్టేషన్లకు ప్రత్యేక విధానం తీసుకొస్తామని మంత్రి ప్రకటించగా, 2030 నాటికి దేశ వార్షిక ఎయిర్‌ కార్గో రవాణాను కోటి టన్నులకు పెంచే లక్ష్యాన్ని అధికారులు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..

కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...

ట్యాగ్లు
హైదరాబాద్ విమానాశ్రయంరాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంయూడీఎఫ్‌ ఛార్జీలుఏఈఆర్‌ఏహైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ఫీజువిమానాశ్రయ టారిఫ్శంషాబాద్ విమానాశ్రయంవిమాన ప్రయాణంవిమానయాన వార్తలుతెలంగాణ విమానయానంఫెడెక్స్ కార్గో హబ్పౌర విమానయానం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..
రాజకీయాలు

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..
జనరల్

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..

కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..
జనరల్

కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..
జనరల్

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..
గాసిప్స్

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత
జనరల్

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..
జనరల్

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..

నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?
సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...
జనరల్

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...

ఇరుముడి మూవీకి ఫిదా అయినా రష్మిక
సినిమాలు

ఇరుముడి మూవీకి ఫిదా అయినా రష్మిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!