26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..

Writer: Chandrika 07:11 AM, 26 ఆగస్టు, 2026
కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..

దశాబ్దాలుగా కరవుతో అల్లాడుతున్న ప్రాంతాలకు భారీ ఊరట కలిగించే వెలిగొండ ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. ఆగస్టు 31న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరవు ప్రాంతాలకు సాగు, తాగునీటి భరోసా కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో కీలక పనులు పూర్తయ్యాయి. జంట సొరంగాల ద్వారా కృష్ణా వరద జలాలను నల్లమలసాగర్ జలాశయానికి తరలిస్తున్నారు. తొలిదశలో 10.70 టీఎంసీల నీటిని జలాశయంలో నిల్వ చేసి 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు.

వెలిగొండ ప్రాజెక్టులో 18.8 కిలోమీటర్ల పొడవైన జంట సొరంగాలు, వాటి నుంచి నల్లమలసాగర్‌కు నీటిని తరలించే 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువ నిర్మాణం పూర్తయింది. నల్లమలసాగర్‌లో 53.85 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. అక్కడి నుంచి తీగలేరు, గొట్టిపడియ, తూర్పు ప్రధాన కాలువల ద్వారా 4,47,300 ఎకరాలకు గ్రావిటీ ఆధారంగా నీటిని సరఫరా చేయనున్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 3,36,100 ఎకరాలు, నెల్లూరులో 84 వేల ఎకరాలు, కడపలో 27,200 ఎకరాలకు సాగునీరు అందనుంది. రెండు దశలు పూర్తయితే ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల్లో సుమారు 24 లక్షల మందికి తాగునీరు అందించే అవకాశం ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత అంచనా వ్యయం రూ.10,200 కోట్లు కాగా, ఇప్పటివరకు సుమారు రూ.7,983 కోట్లు ఖర్చు చేసినట్లు వివరాలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..
ట్యాగ్లు
వెలిగొండ ప్రాజెక్టువెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంఆంధ్రప్రదేశ్చంద్రబాబు నాయుడుకృష్ణా నదినల్లమలసాగర్సాగునీటి ప్రాజెక్టుతాగునీరుప్రకాశంనెల్లూరుకడపఆంధ్రప్రదేశ్ అభివృద్ధి

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..
రాజకీయాలు

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..
జనరల్

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..

కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..
జనరల్

కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..
జనరల్

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..
గాసిప్స్

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత
జనరల్

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..
జనరల్

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..

నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?
సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...
జనరల్

జాతీయ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ఉస్మానియా యూనివర్సిటీ...

ఇరుముడి మూవీకి ఫిదా అయినా రష్మిక
సినిమాలు

ఇరుముడి మూవీకి ఫిదా అయినా రష్మిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!