

‘బాహుబలి’ చిత్రాల ఘన విజయం తర్వాత ఆ ప్రపంచాన్ని మరింత విస్తరించే ఉద్దేశంతో నెట్‌ఫ్లిక్స్ ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ అనే ప్రీక్వెల్ సిరీస్‌ను ప్రకటించింది. శివగామి మహారాణిగా ఎదిగిన ప్రయాణం, మహిష్మతి రాజ్యం సామ్రాజ్యంగా రూపాంతరం చెందే క్రమంలోని కథను ఇందులో చూపించాలని భావించారు. 2018లో అధికారికంగా ప్రకటించిన ఈ ప్రాజెక్ట్‌కు తొలుత మృణాల్ ఠాకూర్‌ను యువ శివగామి పాత్రకు ఎంపిక చేశారు. దేవ కట్టా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వ బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా.. తొలి సీజన్‌ను ది రైజ్ ఆఫ్ శివగామి ఆధారంగా రూపొందించాలని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
అయితే ప్రాజెక్ట్ నిర్మాణ దశలో అనేక కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తొలి వెర్షన్‌లో భారీ స్థాయిలో చిత్రీకరణ జరిగిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ ఆ వెర్షన్‌ను పక్కనపెట్టి సిరీస్‌ను కొత్త రూపంలో రూపొందించాలని నిర్ణయించినట్లు అప్పటి నివేదికలు పేర్కొన్నాయి. మృణాల్ ఠాకూర్ స్థానంలో వామికా గబ్బిని శివగామిగా తీసుకున్నారు. అదే సమయంలో క్రియేటివ్ టీమ్‌లోనూ మార్పులు జరిగాయి. ఈ ప్రాజెక్ట్‌పై సుమారు రెండేళ్లపాటు పనిచేసినట్లు నటుడు బిజయ్ ఆనంద్ వెల్లడించగా, విభిన్న క్రియేటివ్ టీమ్‌లతో సిరీస్‌ను చిత్రీకరించినట్లు తెలిపారు. చివరకు ఎన్నో మార్పులు, భారీ వ్యయం, సుదీర్ఘ నిర్మాణ ప్రక్రియ తర్వాత ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ ప్రేక్షకుల ముందుకు రాకుండానే నిలిచిపోయింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!