

ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా క్యాన్సర్ రోగులకు జన్యు పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లోని నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో ప్రత్యేక జన్యు పరీక్షల ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ఎల్లుండి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించనున్నారు. క్యాన్సర్‌కు సంబంధించిన జన్యు మార్పులను గుర్తించడం, రోగి పరిస్థితికి అనుగుణంగా చికిత్సా విధానాన్ని నిర్ణయించడంలో ఈ పరీక్షలు ఉపయోగపడనున్నాయి.
భవిష్యత్‌లో అమరావతి క్వాంటం వ్యాలీలో పూర్తి స్థాయి జన్యు పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉందని అధికారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలో మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నారు. గుంటూరులో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక ప్రయోగశాల రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవల అభివృద్ధికి కీలకంగా మారనుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!