

రాష్ట్రంలో కనీస వేతన స్కేలుపై ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న 1998, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఈ విద్యా సంవత్సరానికి స్థానాల కేటాయింపు కోసం కౌన్సెలింగ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియను జూన్ 22వ తేదీ లోపు పారదర్శకంగా పూర్తి చేసి, సీనియారిటీ ఆధారంగా స్థానాలను కేటాయించాలని సూచించింది.
గత విద్యా సంవత్సరంలో కౌన్సెలింగ్కు హాజరుకాని వారు, అనధికారికంగా విధులకు దూరంగా ఉన్న వారు లేదా సెలవు అనంతరం తిరిగి విధుల్లో చేరని వారు ఈసారి పునరుద్ధరణకు అర్హులు కాదని పాఠశాల విద్యా డైరెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. మిగిలిన ఉపాధ్యాయులను జూన్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు 11 నెలల పాటు అదే స్థానాల్లో కొనసాగించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కౌన్సెలింగ్ గడువు – జూన్ 22
వర్తించే డీఎస్సీలు – 1998, 2008
సేవా కాలం – 11 నెలలు
పునరుద్ధరణ కాలం – జూన్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!