
సినిమాలు

తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా నైజాం థియేట్రికల్ హక్కులను ‘రాజుకుంట ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ LLP’ సొంతం చేసుకోగా, నైజాం ప్రాంతంలో విడుదలను మైత్రి సంస్థ నిర్వహించనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మమిత బైజు కథానాయికగా నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రానికి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!