
రాజకీయాలు

శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన 'తాయ్ కిళవి' చిత్రం థియేటర్లలో విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకోవడంతో చిత్రబృందం ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా నటీనటులు, సాంకేతిక నిపుణులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను సత్కరించారు. సినిమా ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు శివకుమార్ మురుగేసన్‌కు కృతజ్ఞతగా శివకార్తికేయన్ సరికొత్త మహీంద్రా BE 6 లగ్జరీ కారును బహుమతిగా అందించారు.
సాధారణ టికెట్ ధరలతోనే ఈ చిత్రం 100 రోజుల విజయాన్ని నమోదు చేయడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ దర్శకుడి పనితీరును ప్రశంసిస్తూ, ఆయన కోలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌కు నాంది పలుకుతారని అభిప్రాయపడ్డారు. మంచి కథ, బలమైన భావోద్వేగాలు, సామాజిక సందేశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందని ఆమె కొనియాడారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!