
సినిమాలు

సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్‌ను ఉపయోగించి అభిమానులకు ప్రత్యేక కంటెంట్ అందిస్తున్న తరుణంలో నటి పాయల్ రాజ్‌పుత్ కూడా ఈ ఫీచర్‌ను ప్రారంభించారు. అయితే తన సబ్‌స్క్రిప్షన్‌లో బోల్డ్ లేదా అశ్లీల కంటెంట్ ఉండదని ఆమె స్పష్టంగా వెల్లడించారు. అలాంటి కంటెంట్ ఆశించి ఎవరూ సబ్‌స్క్రైబ్ చేయవద్దని సోషల్ మీడియా వేదికగా గట్టిగా పేర్కొన్నారు.
తన నిజ జీవితానికి సంబంధించిన క్షణాలు, బీహైండ్ ది సీన్స్ అప్‌డేట్స్, ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభవాలను మాత్రమే సబ్‌స్క్రైబర్లతో పంచుకుంటానని పాయల్ తెలిపారు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ప్రస్తుతం నాలుగు మిలియన్లకు పైగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఆమె తాజా ప్రకటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!