
సినిమాలు

ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు తెలంగాణలో నేటి నుంచి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. బోనాలు తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే మహోత్సవమని, ఇది కేవలం పండుగ మాత్రమే కాదని. ప్రజల విశ్వాసం, భక్తికి ప్రతీక అని గవర్నర్ పేర్కొన్నారు.
భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రానికి సుఖశాంతులు, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. భాగ్యనగర్ బోనాలు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నేడు సాయంత్రం గోల్కొండలో బోనాల వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!