

ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నేతన్నలకు అండగా నిలిచేందుకు “నేతన్న భరోసా” అనే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి నేతన్నకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించనుంది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించింది.
చేనేత, జౌళి శాఖ అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 54 వేల మంది నేతన్నలు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారు. సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులు కూడా అర్హులేనని ప్రభుత్వం తెలిపింది. రాట్నం వడకడం, రంగులు అద్దడం వంటి అనుబంధ రంగాల కార్మికులకు కూడా పథకం వర్తింపజేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఇప్పటికే చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!