
జనరల్

హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బ్రిక్స్ దేశాల మంత్రుల కోసం ఏర్పాటు చేసిన అధికారిక విందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బ్రిక్స్ కార్మిక, ఉపాధి మంత్రుల సదస్సు, బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సమ్మిట్ 2026 నేపథ్యంలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విందును ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, చైనా, రష్యా, ఇరాన్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రెజిల్ దేశాల మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీఎస్ ఎన్. శ్రీధర్, డీజీపీ సీవీ ఆనంద్, కార్మిక శాఖ కార్యదర్శి హరి చందన తదితరులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!