

మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ, స్వచ్ఛమైన ఆవు నెయ్యి సరైన మోతాదులో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అన్నం లేదా రొట్టెలతో కొద్దిగా నెయ్యి తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్ల అరుగుదల నెమ్మదిగా జరిగి, గ్లూకోజ్ విడుదల క్రమంగా జరుగుతుంది.
నెయ్యిలో ఉండే లినోలెయిక్ యాసిడ్, బ్యూటిరిక్ యాసిడ్ వంటి పోషకాలు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. రోజుకు 1 నుండి 2 టీస్పూన్లు మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పసుపుతో కలిపి తీసుకోవడం కొంతమందికి ఉపయోగకరంగా ఉండొచ్చని చెబుతున్నప్పటికీ, ఇది మందులకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేస్తున్నారు. అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!