
జనరల్

జూన్ త్రైమాసికంలో GQG పార్ట్నర్స్ ఆదానీ గ్రూప్ కంపెనీల్లో రూ.12 వేల కోట్లకు పైగా పెట్టుబడులను తగ్గించింది. ఆదానీ ఎంటర్‌ప్రైజెస్, ఆదానీ ఎనర్జీ సొల్యూషన్స్ వంటి సంస్థల్లో తన వాటాలను విక్రయించింది. లాభాల స్వీకరణతో పాటు పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మరోవైపు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వాటాలను తగ్గిస్తుండగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు ఆదానీ గ్రూప్ షేర్లలో కొనుగోళ్లను పెంచుతున్నారు. దీంతో ఆదానీ గ్రూప్ దీర్ఘకాల వృద్ధిపై దేశీయ పెట్టుబడిదారుల విశ్వాసం కొనసాగుతోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!