
జనరల్

గడ్డి కుంభకోణం కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లాలూకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ప్రస్తుతం ఆయనకు కొనసాగుతున్న బెయిల్‌పై ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.
అయితే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై లాలూ ప్రసాద్ యాదవ్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ విచారణను వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను న్యాయస్థానం నిర్ణీత ప్రక్రియ ప్రకారం కొనసాగించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!