
జనరల్

వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలను 2028 జూన్ 2 నాటికి ప్రారంభించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై రెండు విమానాశ్రయాల నిర్మాణానికి కేంద్ర సహకారాన్ని కోరారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణపై ప్రత్యేకంగా చర్చించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాలను నిర్మించడంతో పాటు వరంగల్ ఎయిర్‌పోర్ట్‌లో కాకతీయ సంస్కృతి ప్రతిబింబించేలా రూపకల్పన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్న సీఎం, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులతోనూ కీలక సమావేశాలు నిర్వహించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!