

భారత సైన్యంలో చేరాలనుకునే మహిళా అభ్యర్థులకు ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా గొప్ప అవకాశం లభించింది. ఏప్రిల్ 2027లో ప్రారంభమయ్యే 125వ కోర్సు కోసం అర్హత కలిగిన అవివాహిత మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. షార్ట్ సర్వీస్ కమిషన్ (నాన్-టెక్నికల్) కింద మొత్తం 6 ఖాళీలు ఉండగా, అందులో 5 పోస్టులు ఎన్‌సీసీ మహిళా అభ్యర్థులకు, 1 పోస్టు ఆర్మీ పర్సనల్ బ్యాటిల్ క్యాజువల్టీస్ వార్డులకు కేటాయించారు. జులై 21, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎన్‌సీసీ సీనియర్ డివిజన్ లేదా వింగ్‌లో సేవ చేసి, ఎన్‌సీసీ ‘సి’ సర్టిఫికెట్‌లో కనీసం ‘బి’ గ్రేడ్ సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులు. వయస్సు 2027 జనవరి 1 నాటికి 19 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష లేకుండా షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి చెన్నైలోని ఓటీఏలో 49 వారాల శిక్షణతో పాటు నెలకు రూ.56,100 స్టైపెండ్ ఇస్తారు. అనంతరం లెఫ్టినెంట్ హోదాలో నియామకం జరుగుతుంది.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!