
క్రీడలు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ చట్ట సవరణ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 28 నుంచే చట్ట సవరణ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అనుగుణంగా కొత్త నిబంధనలను ప్రభుత్వం ఖరారు చేసింది.
మేయర్, కార్పొరేటర్ల ఎన్నికలకు సంబంధించిన నియమావళిని ఖరారు చేస్తూ ప్రభుత్వం మరో జీఓ జారీ చేసింది. ఈ మార్పులతో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నికలను పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!