
జనరల్

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌కు వెళ్తున్న సమయంలో హెలికాప్టర్ కుప్పకూలినట్లు సమాచారం. ఈ ఘటనలో పైలట్‌తో సహా మొత్తం ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలు, అందులో ప్రయాణిస్తున్న వారి ప్రస్తుత పరిస్థితిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. రెండు హెలికాప్టర్ల సాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రమాద ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!