
జనరల్

అర్నబ్ తుపాను అనంతరం నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా శుక్ర, శని, ఆదివారాల్లో మొత్తం ఆరు రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. అలాగే శుక్రవారం నడవాల్సిన మరికొన్ని రైళ్లను ముందుగా నిర్ణయించిన సమయాల నుంచి మార్పు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
రైళ్ల రద్దు, సమయాల మార్పు కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వేశాఖ సూచించింది. ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ఎన్‌టీఈఎస్, రైల్‌వన్, ఐఆర్‌సీటీసీ యాప్‌లు లేదా వెబ్‌సైట్ల ద్వారా రైళ్ల ప్రస్తుత స్థితిని తెలుసుకోవాలని కోరింది. అదేవిధంగా రైల్వే విచారణ నంబర్ 139 ద్వారా కూడా వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!