

మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో ఎనిమిది నెలలుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నిందితుడు ఎట్టకేలకు ఈగల్ బృందానికి చిక్కాడు. నల్లపాడు పోలీసుల వివరాల ప్రకారం, నగరంలోని ప్రముఖ హోటల్ యజమాని షేక్ ఖాజా మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొంటున్నట్లు ఎనిమిది నెలల క్రితం ఈగల్ బృందం గుర్తించింది. అతను ఇతర ప్రాంతాల నుంచి మాదకద్రవ్యాలను తెప్పించి గుంటూరు నగరంతో పాటు పరిసర గ్రామాలు, సమీప జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
ఈ కేసు దర్యాప్తు సమయంలో నల్లపాడులోని ఓ ఇంట్లో షేక్ ఖాజాకు సంబంధించిన మాదకద్రవ్యాల నిల్వలను పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన విషయం తెలుసుకున్న ఖాజా పరారయ్యాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. దీర్ఘకాలంగా సాగిన గాలింపు అనంతరం ఈగల్ బృందం షేక్ ఖాజాను అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీసులకు అప్పగించింది. అనంతరం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, మాదకద్రవ్యాల సరఫరా నెట్‌వర్క్‌పై ప్రత్యేక విచారణ ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!