
జనరల్

విద్యార్థుల నిరసనలపై పోలీసులు అతిగా వ్యవహరించారంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన స్పష్టం చేశారు. కేవలం శాంతియుత నిరసనలు చేస్తున్నారనే కారణంతో అధికారులు బలప్రయోగం చేయకూడదని పేర్కొన్నారు.
పోలీసుల అధిక చర్యలపై వచ్చిన ఆరోపణలను స్వతంత్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సీజేఐ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజా నిరసనలను నిర్వహించేందుకు ఒకే విధమైన మార్గదర్శకాలు అవసరమని అభిప్రాయపడ్డారు. నిరసన జరుగుతుందనే కారణంతోనే లాఠీచార్జ్ చేయడం సమర్థనీయం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!