

జాతీయ అవార్డు గ్రహీత, ‘కాంతార’ హీరో-దర్శకుడు రిషబ్ శెట్టి తనకు చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్ అంటే ఎంతో అభిమానమని వెల్లడించారు. ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ విడుదలకు ముందు మార్వెల్ రూపొందించిన ప్రత్యేక ప్రచార వీడియోలో కనిపించిన రిషబ్.. స్పైడర్ మ్యాన్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో తొలిసారి స్పైడర్ మ్యాన్ సినిమా చూసినప్పుడే పీటర్ పార్కర్ పాత్రతో అనుబంధం ఏర్పడిందని తెలిపారు. జీవితంలో తప్పులు, కష్టాలు ఎదురైనా మనలోని మంచితనాన్ని కోల్పోకూడదనే విషయాన్ని ఆ పాత్ర తనకు నేర్పిందన్నారు. ఎక్కువ శక్తితో పాటు అంతే బాధ్యత కూడా ఉంటుందనే స్పైడర్ మ్యాన్ సందేశం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని చెప్పారు.
స్పైడర్ మ్యాన్‌పై తనకున్న అభిమానం ఇప్పటికీ అలాగే ఉందని రిషబ్ శెట్టి తెలిపారు. ఇప్పుడు తన పిల్లలు కూడా స్పైడర్ మ్యాన్‌కు అభిమానులుగా మారారని, వారి కోసమే ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’టికెట్లను ముందుగానే బుక్ చేసినట్లు చెప్పారు. కుటుంబమంతా కలిసి థియేటర్‌లో సినిమాను చూడనున్నట్లు వెల్లడించారు. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్‌గా నటించిన ఈ చిత్రం జూలై 30న భారత్‌లో విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!