26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

Writer: Chandrika 07:25 AM, 26 ఆగస్టు, 2026
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీతో సీఎం ఎందుకు భేటీ కావాలనుకున్నారో వివరించాలని ప్రశ్నించారు. మంగళవారం దిల్లీలో విలేకరులతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడం రాజకీయ నిర్ణయం కాదని, పూర్తిగా పరిపాలనా ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేశారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఆయన హోదాకు తగిన విధంగా లేదని విదేశాంగ శాఖ ముందుగానే స్పష్టం చేసిందని తెలిపారు. అవసరమైన అధికారిక క్లియరెన్స్ పొందకుండానే పర్యటనకు ప్రయత్నించి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్, లండన్ పర్యటనలకు అనుమతులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ పలువురు ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలకు అనుమతులు నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తనకు కూడా గతంలో కెనడా, రష్యా పర్యటనలకు అనుమతులు రాలేదని చెప్పారు. విదేశీ యూనివర్సిటీలను రాష్ట్రానికి తీసుకొస్తామని చెబుతున్న సీఎం.. తెలంగాణ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. విద్యాశాఖకు 15 శాతం నిధులు కేటాయిస్తామన్న హామీతో పాటు విద్యార్థులకు స్కూటీలు, విద్యా భరోసా కార్డులు, ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం బ్లాక్-3ను సింగరేణికి కేటాయించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో ప్రైవేట్ సంస్థకు కేటాయించిన ఈ బ్లాక్‌లో సకాలంలో బొగ్గు ఉత్పత్తి జరగకపోవడంతో టెండర్ రద్దు చేసి మళ్లీ వేలానికి తీసుకొచ్చామని చెప్పారు. పీకేవోసీ-2 బ్లాక్‌ను కూడా సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకున్నామని, కోయగూడెం బ్లాక్-3లో గ్రేడ్-1 బొగ్గు ఉందని, దీని ద్వారా సుమారు 120 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సగం, సగం తెలిసిన నేతలు మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

కేరళపై విజయ్‌ ఫోకస్.. దేవన్‌కు కీలక పదవి ఆఫర్?

అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత

అధికారుల వెనకున్న గత ప్రభుత్వ పెద్దలెవరు? కొల్లగొట్టిన వేల కోట్లు ఎవరు కక్కిస్తారు? - కవిత

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష
ట్యాగ్లు
కిషన్ రెడ్డిరేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుఅమెరికా పర్యటనవిదేశాంగ శాఖజోహ్రాన్ మమ్దానీతెలంగాణ ప్రభుత్వంవిద్యా విధానంసింగరేణికోయగూడెం బ్లాక్ 3తెలంగాణ బొగ్గుబీజేపీ
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీజేపీ పోరుబాట.. రామచందర్‌రావు నిరాహార దీక్ష

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి

వివాదాలపై మాట్లాడొద్దు.. నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టండి - రేవంత్‌రెడ్డి

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్‌కు ప్రజ్ఞానంద..
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్‌కు ప్రజ్ఞానంద..

కృతి సనన్‌కు రాహుల్ గాంధీ మద్దతు..
జనరల్

కృతి సనన్‌కు రాహుల్ గాంధీ మద్దతు..

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..
రాజకీయాలు

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కిషన్ రెడ్డి ఫైర్..

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..
జనరల్

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..

కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..
జనరల్

కరవు నేలకు కృష్ణమ్మ పరుగు..

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..
జనరల్

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు..

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..
గాసిప్స్

కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్..

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత
జనరల్

‘విజయ్ రోడ్’గా మారనున్న ఏకనాపురం మెయిన్‌ రోడ్...పరందూర్ రైతుల కృతజ్ఞత

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..
జనరల్

హైదరాబాద్ TIMS ఆస్పత్రిలో త్వరలో పూర్తిస్థాయి సర్జరీ సేవలు..

నెట్‌ఫ్లిక్స్‌ ‘బాహుబలి’ ప్రీక్వెల్‌కు ఏమైంది?
సినిమాలు