
క్రీడలు

హైదరాబాద్‌లో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిమజ్జనాల కోసం ట్యాంక్ బండ్ ప్రాంతానికి భారీగా విగ్రహాలు, భక్తులు, వాహనాలు తరలివస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పోలీసులు పలు రహదారులను మూసివేసి వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు.
రోడ్లను బ్లాక్ చేయడంతో ఉద్యోగాలు, ఇతర పనుల కోసం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించిన స్పష్టమైన రూట్ మ్యాప్‌లు అందుబాటులో లేకపోవడంపై పలువురు ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ పరిస్థితులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!