

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తున్నారు. ఐమ్యాక్స్ వెర్షన్‌లోనూ సినిమాను రూపొందిస్తున్నట్లు ఇప్పటికే సమాచారం రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
తాజాగా నిర్మాతల్లో ఒకరైన ఎస్‌ఎస్ కార్తికేయ ‘వారణాసి’ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా చాలా గ్రాండ్ స్కేల్‌లో ఉండబోతుందని కూడా ఆయన వెల్లడించారు. మరోవైపు షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మేకర్స్ వేగంగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. విజువల్స్, వీఎఫ్‌ఎక్స్, ఇతర సాంకేతిక అంశాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూనే పనులను పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో ‘వారణాసి’ అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలపై అభిమానుల్లో మరింత క్లారిటీ వచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!