

వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వచ్చిన మరో ఆసక్తికరమైన చిత్రం ‘మోధరాత్రి’. రిషికాంత్, అనిష్మా అనిల్ కుమార్, చేతన్, భగవతి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాతో రాజా కరుప్పసామి దర్శకుడిగా పరిచయం అయ్యారు. పెళ్లి నేపథ్యంలో సాగే పూర్తిస్థాయి వెడ్డింగ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను నవ్విస్తూ మంచి స్పందనను సొంతం చేసుకుంది.
థియేట్రికల్ రన్‌లో మంచి టాక్ తెచ్చుకున్న ‘మోధరాత్రి’ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు కూడా ఈ కామెడీ డ్రామాను ఓటీటీలో చూసే అవకాశం లభించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!