
బిజినెస్

బీహార్‌కు చెందిన ఎంపీ పప్పు యాదవ్‌పై ఢిల్లీలో దాడికి యత్నం జరిగింది. తన నివాసంలో నిర్వహిస్తున్న విలేకరుల సమావేశం సమయంలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అప్రమత్తమైన పప్పు యాదవ్ అనుచరులు ఆ వ్యక్తిని పట్టుకుని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు ఘటనపై స్పందించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై పప్పు యాదవ్ స్పందిస్తూ, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని తెలిపారు. ఎవరైనా తనను హత్య చేయాలని భావిస్తే తనను చంపనివ్వండి, కానీ ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!