
క్రీడలు

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అనుమతులు లేకుండా నడుస్తున్న నాలుగు ఆహార తయారీ కేంద్రాలు వెలుగులోకి వచ్చాయి. సమోసాలు, పానీపూరీ వంటి ఆహార పదార్థాలను అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు, వెంటనే ఆయా యూనిట్లను సీజ్ చేశారు.
నగరంలో కల్తీ ఆహార తయారీపై కొనసాగుతున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఆహార తయారీదారులు తప్పనిసరిగా అనుమతులు పొందడంతో పాటు పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే యూనిట్లపై భవిష్యత్తులో కూడా కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!