

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో గిరిజన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి అవహేళనలు ఎదురయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన దీప్కే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. కొందరు తనను ముఖ్యమంత్రిగా భావించి విమర్శించారని పేర్కొంటూ.. బాలాఘాట్‌లో గిరిజన చిన్నారుల మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
బాలాఘాట్‌లో 30 మందికి పైగా గిరిజన పిల్లల మరణాల అనంతరం ప్రభుత్వం తొలుత రూ.2 లక్షల పరిహారం ప్రకటించిందని, గిరిజన వర్గాల ఆందోళనల తర్వాత దాన్ని రూ.4 లక్షలకు పెంచిందని దీప్కే విమర్శించారు. చిన్నారుల మరణాలకు కారణమైన వైద్యాధికారులపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. గిరిజనుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరానికి నిరసనగా తన వ్యాఖ్యలు చేశానని, ఈ పరిస్థితుల్లో పదవిలో కొనసాగడానికి తనకు నైతిక హక్కు లేదన్న భావనను వ్యక్తం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!