
క్రీడలు

ఆసియా కప్ ఫైనల్‌లో టీమిండియా ఉమెన్స్ బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత ఇన్నింగ్స్‌కు భారీ స్కోరు అందించారు. స్మృతి మంధాన 59 పరుగులు చేయగా, షఫాలీ వర్మ 68 పరుగులతో హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.
భారత బ్యాటర్ల దూకుడుతో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. దీంతో ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక ఉమెన్స్ టీమ్ ముందు 184 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. కీలక ఫైనల్‌లో భారత బౌలర్లపై ఒత్తిడి పెంచేలా బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!